thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 6:46 AM IST

ETV Bharat / Videos

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా కేదారి గౌరీ వ్రతం - పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు

Kedara Gowri Vratam in Kalahasti : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ సన్నిధిలో సోమవారం శ్రీ కేదారి గౌరీ వ్రతం  ఘనంగా జరిగింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో శాస్త్రోక్తంగా అర్చకులు వ్రతం నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని ప్రత్యేకంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు.

Shri Gnana Prasunambhika Devi in Srikalahasti : శ్రీ కేదారి గౌరీ వ్రతంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈవో విద్యాసాగర్ బాబు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయం తరఫున పూజ సామగ్రిని పంపిణీ చేశారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు వ్రత పూజలు చేపట్టారు. వ్రతం విశిష్టత గురించి భక్తులకు తెలియజేశారు. సామూహిక గౌరీ వ్రతంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదివారం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో (Srikalahasti) ఘనంగా అమావాస్య ఉత్సవాలు జరిగాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.