ETV Bharat / spiritual

కార్తిక దీపోత్సవం - నెల్లూరులో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత - KARTHIKA DEEPOTSAVAM

నెల్లూరులో వైఎంసీఏ మైదానంలో ఘనంగా కార్తిక దీపోత్సవం - భారీగా తరలివచ్చిన మహిళలు

karthika_deepotsavam
karthika deepotsavam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 10:39 PM IST

Karthika Deepotsavam Organized by ETV in Nellore: ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో నెల్లూరులో కార్తిక దీపోత్సవం కన్నున పండువగా జరిగింది. ఏసీ కూరగాయల మార్కెట్‌ పక్కన ఉన్న వైఎంసీఏ మైదానంలో నిర్వహించిన దీపోత్సవానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలకు నిర్వహకులు పూజాసామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు.

వేల దీపాల కాంతులతో మైదానమంతా ఆధ్యాత్మికంగా వెల్లివిరిసింది. సంప్రదాయ వస్త్రధారణలో దీపోత్సవానికి వచ్చిన మహిళలు, యువతుల ఓంకార నాదాలు, వేదమంత్రాలతో హోరెత్తింది. దీపోత్సవంలో సనాతన ధర్మంలోని గోవు విశిష్టత, గోపూజ ఫలాలపై శ్రీనివాస బంగారయ్య శర్మ ప్రవచనం చెప్పారు. అనంతరం మహిళలతో సాముహికంగా దీపోత్సవ పూజ చేశారు. రెండు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి ప్రవత్తులతో దీపాలు వెలిగించి కైలాసనాథుడ్ని ప్రార్థించారు.

కార్తిక పురాణం వింటే చాలు - తెలిసీ, తెలియక చేసిన పాపాలు అన్నీ నశించడం ఖాయం!

గోదారోళ్ల కార్తిక విస్తరి - తింటే ఆహా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.