AR Rahman, Wife Saira Banu Get divorced : చిత్ర పరిశ్రమలో మరో ప్రముఖ జంట విడాకులు తీసుకోనుంది. తన భర్త, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోతున్నట్లు సైరా షాకింగ్ న్యూస్ అధికారికంగా ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు తెలిపారు. అలానే ఈ దంపతుల తరఫున ప్రముఖ లాయర్ వందనా షా కూడా వీరి డివొర్స్ ప్రకటన విడుదల చేశారు.
"ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ, విడాకులు తీసుకునేందుకు రెహమాన్, సైరా బాను నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో భావోద్వేగపూరిత ఒత్తిడి నెలకొంది.
అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయి" అని లాయర్ వందనా షా పేర్కొన్నారు.
విడాకులపై ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ - "మా పెళ్లి బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని ఆనందించాం. కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుడిని కూడా ప్రభావితం చేస్తాయి. పగిలిన ముక్కలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవు. అయినా కూడా మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం" అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
కాగా, 1995లో రెహమాన్ సైరా వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్యానికి 29 ఏళ్లు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఖతీజా, రహీమా, అమీన్ వీరి సంతానం. సైరాతో వివాహాన్ని తన తల్లి నిశ్చయించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ తెలిపారు. "సినిమాలకు సంగీతం అందిస్తూ చాలా బిజీగా ఉండేవాడిని. 29 ఏళ్ల వయసులో, పెళ్లి చేసుకుంటా, అమ్మాయిని చూడు అని అమ్మకు చెప్పాను" అని పేర్కొన్నారట.
రెహమాన్ సినిమాల విషయానికొస్తే ఆయన చివరిగా ధనుశ్ రెండో సారి దర్శకత్వం వహించిన రాయన్ సినిమాకు సంగీతం అందించాడు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఛావా, థగ్ లైఫ్, గాంధీ టాక్స్ సహా పలు భాషలలోని అనేక చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.
షారుక్ ఖాన్ కొడుకు ఎంట్రీకి రంగం సిద్ధం - కానీ హీరో కాదు
ప్రభాస్, హను రాఘవపూడి 'ఫౌజీ' అప్డేట్ - షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందంటే?