kakinada people protest For Water: కాకినాడ నగర శివారులో కలుషిత నీరు సరఫరా.. ఆందోళనకు దిగిన బాధితులు - కాకినాడ నగర శివారు వాసులకు తాగునీటి కష్టాలు
🎬 Watch Now: Feature Video
Kakinada People Protest For Water : కాకినాడ ప్రజలకు నీరు అందుబాటులో ఉన్న వారు తాగడానికి ఉపయోగకరంగా లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కోంటున్నారు. కాకినాడ నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తీవ్రమవ్వడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అర కొర నీటితో పాటు కలుషిత నీరు సరఫరా చేస్తున్నారంటూ దుమ్ములపేట స్థానికులు ఆందోళన చేపట్టారు. దుమ్ములపేట, పర్లోపేట, డైరీఫారమ్ సెంటర్, రెవెన్యూ కాలనీ ప్రాంతాల్లో కుళాయి నీరు ఏమాత్రం సరిపోవటం లేదని అలాగే పసర రంగులో మురుగునీరు వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం శుభ్రమైన నీరు నగరపాలక సంస్థ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. స్థానికులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు మద్దతుగా నిలిచారు.
కుళాయిలకు తాగునీరు సక్రమంగా సరఫరా జరగకపోవడం, కొన్ని ప్రాంతాల్లో రంగు మారిన నీళ్లు రావడం వంటి సమస్యలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్థానిక డెయిరీ ఫారం రక్షిత మంచి నీటి ట్యాంకు వద్ద గురువారం ఆయన స్థానిక మహిళలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖాళీ బిందెలతో వచ్చిన మహిళలతో వచ్చిన మహిళలనుద్దేశించి ఆయన మాట్లాడారు. గత టీడీపీ పాలనలో వేసవికి ముందే నగరంలోని తాగునీటి సరఫరాపై ముందస్తు ప్రణాళికలు రూపొందించేవారమని గుర్తు చేశారు.