JC Warning: అలా చేస్తే ఫస్ట్ టైం గాలి తీస్తాం.. రెండో సారి..! - jc prabhakar latest news
🎬 Watch Now: Feature Video
JC PRABHAKAR REDDY FIRES ON REVENUE OFFICERS: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలోని తన ఇంటిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక నుంచి తాము అన్యాయాన్ని సహించేది లేదని.. నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక, మట్టి తోలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇసుక, మట్టి తరలింపునకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు తమ కర్తవ్యం నిర్వర్తించాలని, లేనిపక్షంలో సోమవారం నుంచి అధికారుల ఇంటి వద్ద నిరసన చేస్తామని స్పష్టం చేశారు. తాడిపత్రిలో జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదులు చేసి చేసి అలసి పోయామని ఫైర్ అయ్యారు. అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్ల యజమానులను హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా మానుకోవాలని, లేనిపక్షంలో ట్రాక్టర్‌ను కాల్చి పడేస్తా అంటూ ఒక రేంజ్‌లో ఎగసిపడ్ఢారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండన్న జేసీ.. మొదటి ముద్దాయి తానే అవుతానని.. అన్నింటికీ సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అన్యాయాన్ని ఎదిరించడానికి ఎంతవరకైనా తెగిస్తామని, ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.