జీరో ఇంటి నెంబర్లతో బోగస్ ఓట్ల నమోదు - తహసీల్దార్ కార్యాలయం వద్ద జేసీ నిరసన - ఓట్ల అక్రమాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 4:55 PM IST
JC Prabhakar Reddy Protest At Tehsildar Office: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలకు బోగస్ ఓట్ల బెడద తప్పడం లేదు. గల్లి నుంచి మెుదలుకొని జిల్లాలోని ప్రతి వార్డులో ఎక్కడో ఒక్కచోట అక్రమ ఓట్ల నమోదు, లేదా టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపులు జరుతూనే ఉన్నాయి. కార్యకర్తలు మెుదలు తెలుగుదేశం అధినేత వరకూ అక్రమ ఓట్ల నమోదుపై పోరాడుతూనే ఉన్నారు. తాజాగా అక్రమ ఓట్ల నమోదుపై, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓట్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడిపత్రి నియోజకవర్గంలో '0-0' ఇంటి నెంబర్లతో ఓట్లు నమోదు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్రమాలపై ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా ఇవ్వటానికి ఏమిటి ఇబ్బందంటూ తహసిల్దార్ అలెగ్జాండర్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. దొంగ ఓట్లు చేర్చుతున్నారని తమ కార్యకర్తలు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. అక్రమ ఓట్లపై చర్యలు తీసుకోవాలంటూ, తహసిల్దార్ కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అక్రమాలపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.