Janasena: ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన సాయం.. బీమా చెక్కులు పంపిణీ - AP Latest News
🎬 Watch Now: Feature Video
Janasena chief Pawan Kalyan: రానున్న ఎన్నికల పురస్కరించుకుని రాజకీయ పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసైనికులు, నాయకులు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యర్రంశెట్టివారి పాలెం, కూనవరం గ్రామాలలో ప్రమాదంలో చనిపోయిన రెండు కుటుంబాలకు.. ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మత్స్యకారుల భరోసా పేరుతో ప్రభుత్వం వారిని మోసం చేస్తుందని.. అర్హత గల వారిని జాబితా నుంచి తప్పించి వారికి కావలసిన వారిని జాబితాలో చేర్చుతున్నారని ఆయన అన్నారు. దీనిపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో.. రేపు కాకినాడలో మత్స్యశాఖ జేడీ కార్యాలయంలో జనసేన పార్టీ తరపున వినతిపత్రం అందజేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.