Pawan on New Parliament Building: భరతమాత మెడలో మరో మణిహారం సెంట్రల్ విస్టా : పవన్ కల్యాణ్ - New Parliament Building news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 28, 2023, 4:49 PM IST

Updated : May 28, 2023, 5:59 PM IST

Pawan Kalyan announcement on the new Parliament building: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై ఓ ప్రకటన విడుదల చేశారు. నూతన పార్లమెంట్ భవనం.. భరతమాతకు మరో మణిహారమని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. వీరుల త్యాగఫలంతో స్వాతంత్య్రం సాధించిన భారతావని.. సగర్వంగా వజ్రోత్సవాలు జరుపుకొందని గుర్తు చేశారు. ఈ 75 ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు, మరెన్నో చేర్పులు జరిగాయన్న పవన్.. పరాయి పాలకుల క్రీనీడలను పారదోలుతూ ఎన్నో కొత్త నిర్ణయాలు, విజయాలు అందుకున్నామన్నారు. 

వారంతా చరితార్థులు... అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అవిరళ కృషి చేస్తున్న సమయాన.. భరతమాత మెడలోని హారంలో మరో కొత్త సుమం చేరుతోందని.. అదే సెంట్రల్ విస్టా ఆవరణలో శోభాయమానంగా రూపుదిద్దుకున్న నూతన పార్లమెంటు భవనమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల కళల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ నిలయాన్ని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన శుభ తరుణాన జనసేన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన నరేంద్ర మోదీకి, బీజేపీ నాయకత్వానికి అభినందనలు తెలిపారు. భవన నిర్మాణంలో పాలుపంచుకున్న వారంతా చరితార్థులని పవన్‌ కల్యాణ్ వివరించారు.

జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు.. పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో.. 'భరత మాతకు మరో మణి హారం నూతన పార్లమెంట్ భవనం' అనే శీర్షికతో..''వీరుల త్యాగఫలంతో స్వతంత్రతను సాధించిన భారతావని సగర్వంగా వజ్రోత్సవాన్ని జరుపుకొంది. ఈ 75 వసంతాలలో ఎన్నో మార్పులు.. మరెన్నో చేర్పులు. పరాయి పాలకుల క్రీనీడలను పారదోలుతూ ఎన్నో కొంగొత్త నిర్ణయాలు.. విజయాలు. అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అవిరళ కృషి చేస్తున్న సమయాన మన భరతమాత మెడలోని హారంలో మరో కొత్త సుమం చేరుతోంది. అదే సెంట్రల్ విస్టా ఆవరణలో శోభాయమానంగా రూపుదిద్దుకున్న నూతన పార్లమెంటు భవనం. వివిధ రాష్ట్రాల కళల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ రాజ్యాంగ నిలయాన్ని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన శుభ తరుణాన జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. త్రికోణాకారంలో రూపుదిద్దుకున్న ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన శ్రీ నరేంద్ర మోడీ గారికి, బి.జె.పి. నాయకత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నాను. భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చరితార్ధులుగా భావిస్తున్నాను.'' అని ఆయన పేర్కొన్నారు.

Last Updated : May 28, 2023, 5:59 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.