Janasena on data theft in CMO జగన్కు తెలియకుండానే సీఎం సంతకాలు..! ఆ 220ఫైళ్లు దేనికి సంబంధించినవో చెప్పాలి!: నాదెండ్ల - జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్
🎬 Watch Now: Feature Video
Janasena on data theft in CMO : సీఎం పేషీలో జరిగిన డేటా చోరీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడరా..? అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇ-ఫైలింగ్ పేరుతో సీఎంకు తెలియకుండానే సంతకాలు జరిగిపోతున్నాయని, సంతకాలు పూర్తయిన 220 ఫైళ్లు దేనికి సంబంధించినవో చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీ రోజురోజుకూ బలపడుతోందని, జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం హైదరాబాద్‌లోని ప్రైవేట్ సంస్థకు పంపిస్తున్నారన్న నాదెండ్ల.. సర్పంచులను డమ్మీలు చేసి వాలంటీర్లు పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. సీఎం కార్యాలయం, సీఎం నివాసంలో ఇ-ఫైలింగ్ పేరుతో జరిగిన డేటా చోరీ, 220 ఫైళ్లపై సంతకాలు దేనికి సంబంధించినవో చెప్పాలని అన్నారు. సీఎంవోలో ఇష్టారాజ్యంగా డబ్బు చేతులు మారుతోందని, ఒక్కో పనికి ఒక్కో ధర పెట్టి మరీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులకు ఏ విషయంపైనా కనీస సమాచారం ఉండట్లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికిపోతున్నారని, కోర్టు ఆదేశాలు ధిక్కరించి మరీ ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అన్నారు. తితిదే ఛైర్మన్‌గా భూమన నియామకం వల్ల ఒరిగేదేం లేదని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.