జగనన్న రీసర్వేలో భూమి పట్టాలు రద్దు - ఉరేసుకుని గిరిజనుల నిరనస

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 5:45 PM IST

Jagananna Resurvey Problems In Anakapally District : జగనన్న రీ- సర్వేలో రద్దయిన భూమి పట్టాలను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కవ్వగుంటలో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు సాగు చేస్తున్న జీడి మామిడితోటలో మెడకు ఉరివేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సుమారు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tribals Protest Against Land Resurvey : రీసర్వేలో పాస్​బుక్​లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని బాధితులు వాపోతున్నారు. ఒక వైపు బ్యాంక్​ల నుంచి వేధింపులు మరో వైపు వెబ్​ల్యాండ్​లో రికార్డులు 1బీ రాకపోవడంతో అప్పుల పాలై కష్టాల్లో కూరుకుపోయామని గిరిజనులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని ఆదివాసులు డిమాండ్​ చేస్తున్నారు. సుమారు 31 కుటుంబాలకు చెందిన ఆదివాసీ గిరిజనులను పాలకులు ఇబ్బందులకు గురి చేయడం తగదని వాపోయారు. దీనిపై పాలకులు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.