ఓట్ల జాబితాలో అక్రమాలు- పట్టించుకోండి మహా ప్రభో! - బూత్ లెవల్ కన్వినర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 4:39 PM IST
|Updated : Jan 6, 2024, 4:46 PM IST
Irregularities in Anantapur voter list: అనంతపురం జిల్లా ఉరవకొండ129 పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ జాబితాలో మృతులు, డబుల్ ఎంట్రీలు, స్థానికేతర్ల పేర్లు కొనసాగుతున్నాయని బూత్ లెవల్ కన్వినర్ నిమ్మల ప్రసాద్ అన్నారు. గతంలోనే అక్కడి బూత్ లెవల్ ఏజెంట్లు వాటి తొలగింపును కోరినట్లు ఆయన తెలిపారు. మృతులకు సంబంధించిన ఆధారాలను ఇచ్చినప్పటికీ ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితాలో మృతుల ఓట్లు అలాగే వచ్చాయన్నారు.
ఆ జాబితాలో స్థానికేతరుల ఓట్లను గుర్తించామన్న ఆయన ఓటర్ల జాబితాలోని లోపాలను బీఎల్ఏలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో ప్రచురితమయ్యే ఓటర్ల జాబితాలోనైనా మృతులు, స్థానికేతరుల పేర్లు తొలగిస్తారా లేదా అన్న ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం సరైన ఓటరు జాబితాను జారీ చేయాలని బూత్ లెవల్ కన్వినర్ నిమ్మల ప్రసాద్ కోరారు.
" ఉరవకొండ129 పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితాలో మృతులు, డబుల్ ఎంట్రీలు, స్థానికేతర్ల పేర్లు కొనసాగుతున్నాయి. గతంలోనే అక్కడి బూత్ లెవల్ ఏజెంట్లు వాటి తొలగింపును కోరాం. మృతులకు సంబంధించిన ఆధారాలను ఇచ్చినప్పటికీ ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితాలో మృతుల ఓట్లు అలాగే వచ్చాయి. ఇప్పటికైనా ఎన్నికల సంఘం సరైన ఓటరు జాబితాను జారీ చేయాలని కోరుతున్నాం." - నిమ్మల ప్రసాద్, బూత్ లెవల్ కన్వినర్