ఈ ఫలితాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు నాంది: రామగోపాల్‌రెడ్డి - Rayalaseema Graduate MLC Elections
🎬 Watch Now: Feature Video
పట్టభద్రుల స్థానాల గెలుపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు నాంది అని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి చెప్పారు. పట్టభద్రులు, యువతకు ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వారి ఆశలపై నీళ్లు చల్లి మోసం చేశారని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపై వైసీపీ నేతలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా.. తమ నిబంధనలకు లోబడి.. వైసీపీ అక్రమాలకు అడ్డుకట్టవేసి ఓట్ల లెక్కింపు జరిపించారని ఆయన తెలిపారు. తాను గెలుస్తున్న సందర్భంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్వయంగా శుభాకాంక్షలుచెప్పి, తమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీ గెలుపు కనువిపప్పు కావాలని చెప్పారని రామగోపాల్ రెడ్డి అన్నారు. అయితే సాయంత్రానికి ఏమి జరిగిందో వైసీపీ నేతల్లో మార్పు వచ్చి ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అనటం విశ్వేశ్వరరెడ్డి వంటి ఉద్యమ నాయకులకు భావ్యం కాదని రామగోపాల్ రెడ్డి అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డితో ముఖాముఖి.