'బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది' - ఇండియా కూటమి పార్టీల నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 5:08 PM IST

thumbnail

INDIA Alliance Parties Protest Against MPs Suspension: ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి పార్టీలు నిరసన తెలిపాయి. విజయవాడ లెనిన్ సెంటర్​లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇతర నేతలు నిరసనలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రజాస్వామిక పద్ధతిలో 140 మందికి పైగా పార్లమెంట్ సభ్యులను బీజేపీ సర్కార్ సస్పెండ్ చేసిందని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శించారు. 

బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతుందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని నినాదాలు చేశారు. పార్లమెంట్​లోకి దుండగులు ప్రవేశించి పొగబాంబులు వేయడంపై చర్చకు రావాలని కోరినందుకు ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మోదీకి జై కొడుతున్నాయని విమర్శించారు. మోదీ నిరంకుశ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.