ఇంఛార్జ్ ఆడిట్ డైరెక్టర్ పదవి నుంచి హరిప్రకాశ్ తొలగింపు, ఆ కారణంగానే! - ఏపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 10:44 AM IST
|Updated : Nov 7, 2023, 2:15 PM IST
Incharge Audit Director Hariprakash Dismiss: ఇంఛార్జ్ ఆడిట్ డైరెక్టర్ ఆర్.హరిప్రకాశ్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరిప్రకాశ్ను ఆదేశిస్తూ ఆర్థికశాఖ అధికారులు ఉత్తర్వులు పంపించారు. ఆ శాఖలోని జాయింట్ డైరెక్టర్ విజయభారతికి స్టేట్ ఆడిట్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కిందిస్థాయి ఉద్యోగులపై వేధింపులు, మాట విననివారిని ఇష్టానుసారంగా బదిలీలు, సస్పెన్షన్లు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై.. ప్రభుత్వం ఆయన్ను ఆడిట్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. జోన్ 4 లో 14 మందిని ఒకేసారి బదిలీ చేసిన అంశంతో పాటు వారికి 5 నెలలుగా వేతనాలు లేకుండా చేయటంలోనూ హరిప్రకాశ్ రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
Employees Protest Over State Audit Director: వేధింపులు, సస్పెన్షన్లపై గడచిన ఏడాది కాలంగా ఆడిట్ ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నా.. పై స్థాయిలో అండదండలు ఉండటంతో ఆయన ఆడిట్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆడిట్ డైరెక్టర్ గా ఆయన్ను తొలగించాలంటూ ఆ శాఖ ఉద్యోగులు వారం రోజుల పాటు దీక్షలు నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం ఆయన్ను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.