Impatience With Indrakiladri Lift Operators : ఇంద్రకీలాద్రి లిఫ్ట్ ఆపరేటర్ల తీరుపై విమర్శలు.. మహిళలను బలవంతంగా బయటకు తోసేసిన సిబ్బంది - Fight in Indrakiladri lift
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-10-2023/640-480-19654124-thumbnail-16x9-indrakiladri-lift-operators.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 1:57 PM IST
|Updated : Oct 2, 2023, 12:37 PM IST
Impatience With Indrakiladri Lift Operators : ఇంద్రకీలాద్రి లిఫ్ట్ ఆపరేటర్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. గిరి ప్రదక్షిణకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వృద్ధులు, కొంత మంది మహిళలు లిఫ్ట్ నంబర్ 4 లో ఎక్కారు. ఆ సమయంలో కొండపై నుంచి కిందికి వెళ్లేందుకు దుర్గ గుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు కూడా వచ్చారు. అక్కడే ఉన్న సిబ్బంది లిఫ్ట్‌లో ఉన్న మహిళలను బలవంతంగా బయటకు తోసేసి ఛైర్మన్, వారి సహచరులను మాత్రమే ఎక్కించారు. మిగిలిన లిఫ్ట్‌లను కూడా ఆపివేయటంతో వాగ్వాదానికి దిగిన మహిళలపై ఆలయ ప్రైవేటు సిబ్బంది ఎదురు దాడికి దిగారు. ఇదంతా అక్కడే ఉన్నఛైర్మన్ గమనించినా పట్టించుకోలేదు. హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వచ్చారు. 4లిఫ్ట్‌లు తెరిపించి అందర్నీ కిందకి పంపారు. అమ్మవారి దర్శనం కోసం ఎంతో దూరం నుంచి వస్తే ఆలయ సిబ్బంది అత్యుత్సాహం సరికాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.