I Am with Babu Song on Chandrababu Naidu: ఐయామ్ విత్ బాబు..'పోరాట సింహం' చంద్రబాబుకు సంఘీభావం - Song on Chandrababu Naidu
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 9:24 PM IST
I Am with Babu Song on Chandrababu Naidu: చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంఘీభావంగా... 'బాబుతో నేను' పేరుతో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు.. తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు 'బాబుతో నేను' లోగోను టీడీపీ ఆవిష్కరించింది. రేపటి నుంచి టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు చేయనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుట్ర కోణాలు వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంఘీభావంగా ఆ పార్టీ ఓ పాటను (Song on Chandrababu Naidu) విడుదల చేసింది.
"ఐయామ్ విత్ బాబు" (IAmWithBabu) హ్యాష్‌ట్యాగ్‌తో టీడీపీ సానుభూతిపరులు సామాజిక మాధ్యమాల్లో ఆ పాటను వైరల్ చేస్తున్నారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది తెలుగు ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. తమ అభిమాన నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం వీడారు.