భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త - అనాథలుగా మిగిలిన ఇద్దరు కుమారులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 6:15 PM IST
Husband Killed His Wife Out of Suspicion : అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్లలో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గుత్తులవారిపాలెం గ్రామానికి చెందిన సాయిహరితకు వెంకటేశ్వర్లులతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వర్లు వివాహానంతరం వ్యసనాల బారి పడి అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగ నిమిత్తం వీరు ఐదు నెలల క్రితం ఖమ్మం వెళ్లిపోయారు. ఈ నెల ఒకటో తేదిన సాయి హరిత భీమవరం వచ్చింది. అక్కడ నుంచి ఊనగట్ల చేరుకుంది. దుబాయ్లో ఉంటున్న సాయి హరిత తల్లి ధనలక్ష్మికి అల్లుడు ప్రవర్తన ఏ మాత్రం నచ్చలేదు. ఈ కారణంగా కుమారైను తిరిగి ఖమ్మం వెళ్లవద్దని చెప్పిందని బంధవులు తెలిపారు. ఆ కోపంతో ఖమ్మం నుంచి శనివారం తెల్లవారుజామున వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చి హత్యచేసినట్లు బంధువులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తల్లిని కోల్పోయి తండ్రి జైలు పాలు కావడంతో ఇద్దరు కుమారులు అనాథలుగా మారడం.. స్థానికులను కలచివేసింది. నిందితుడు వెంకటేశ్వరపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.