Huge Protest in Karnataka against Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా కర్ణాటకలో కొనసాగుతున్న నిరసనలు - వైసీపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2023, 9:13 PM IST
Huge Protest in Karnataka against Chandrababu arrest:చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు జిల్లా పావుగడ పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నినాధాలు చేస్తూ... రెండు కిలోమీటర్ల మేర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేము సైతం బాబు కోసం నినాధాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, శ్రీ శనేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కర్ణాటకలోని పలు పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలతో పాటు జనసేన నేతలు మద్దతు తెలిపాయి. కర్ణాటకలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు కళ్యాణదుర్గం ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని కౌరవులకు పట్టినగతే వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని విమర్శించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని తెలిపారు. ఆయన కేవలం ఆంధ్రకే కాదు.. అన్ని ప్రాంతాల్లో పేరుగాంచిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. గతంలో పలువురిని ప్రధాన మంత్రులు చేసిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి ప్రస్తుతం ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జగన్ ఓర్వలేకే చంద్రబాబును అరెస్టు చేయించారని విమర్శించారు. సైకో జగన్ సైతాన్ల వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఓటుతో జగన్ కు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.