Lorry Accident Live Video : 3 కార్లపైకి దూసుకెళ్లిన యాపిల్ లారీ.. భార్యాభర్తలు మృతి - Shimla lorry accident august 8th
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-08-2023/640-480-19220755-thumbnail-16x9-lorry-accident.jpg)
Himachal Pradesh Lorry Accident Live Video : హిమాచల్ ప్రదేశ్‌లో సిమ్లా జిల్లాలో యాపిల్ లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ధియోగ్ఛైలా రోడ్డుపై మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వాహనం అదుపు తప్పి ఎదురుగా ఉన్న మూడు కార్ల, బైక్‌ను ఢీకొట్టింది. ఓ కారులో ఉన్న దంపతులు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. మిగిలిన వాహనాలు తుక్కుతుక్కు అయ్యాయి. అందులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు వేంటనే రెండు జేసీబీల సాయంతో గంటపాటు శ్రమించి లారీని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
"యాపిల్స్‌తో ఉన్న లారీ సోలన్‌కు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం థియోగ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. ప్రమాదం గురించి మృతుల కటుంబసభ్యులకు సమాచారం అందించాం. లారీ రాంగ్ రూట్లో రావటం, బ్రేక్ ఫెయిల్ అవ్వటం వల్ల ఈ ప్రమాదం జరిగింది." అని పోలీసుల తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని థియోగ్ పోలీసులు తెలిపారు.