నిర్వాసితులుగా ఒకసారి నమోదైతే ఎక్కడున్నా పరిహారమివ్వాల్సిందే: హైకోర్టు
🎬 Watch Now: Feature Video
High Court On Polavaram Land Compensation : పోలవరం నిర్వాసిత ప్రాంతంలో నివాసం ఉండటం లేదనే కారణంగా తనకు పరిహారం ఇవ్వటం లేదని అల్లూరి జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన దిడ్డి ప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించారు. బ్రతుకుదెరువు కోసం ఊరి విడిచి వెళ్లినందుకు నిర్వాసితులు కాదు అంటూ రెవెన్యూ అధికారులు తమకు రావలసిన భూపరిహారాన్ని నిరాకరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. బతుకుదెరువు నిమిత్తం పక్క జిల్లాలకు వెళ్లే నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడం చట్టరీత్యా చెల్లదన్నారు. భూసేకరణ చట్టంలోని అంశాల ప్రకారం నిర్వాసితులుగా ఒకసారి నమోదైతే వారు ఎక్కడ నివసిస్తున్నా పరిహారం ఇవ్వాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. శ్రావణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. నిర్వాసితులు కాదంటూ తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. తక్షణమే పిటిషనర్‌కు భూసేకరణ చట్టం ప్రకారం అన్ని పరిహారాలు చెల్లించవలసిందిగా రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది.