High Court on Amaravati Tenant Farmers Petition: రాజధాని రైతుల కౌలు కేసు.. సీఆర్డీఏ, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు - high court notices to government

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 22, 2023, 3:22 PM IST

High Court on Amaravati Tenant Farmers Petition: రాజధాని అమరావతి రైతులకు కౌలు చెల్లించకుండా వస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాజధాని రైతుల కౌలు చెల్లించే కేసులో సీఆర్డీయే, ప్రభుత్వానికి హైకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తమకు వార్షిక కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. రైతులకు కౌలు చెల్లించేందుకు జీవో ఇచ్చి ప్రభుత్వం కౌలు చెల్లించలేదని రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. ప్రతి ఏడాది మేలో కౌలు చెల్లించే వారని, ఈ ఏడాది నేటి వరకు కౌలు చెల్లించలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వాదనలు విన్న న్యాయస్థానం సీఆర్డీయే, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.