Head Master Beat Third Class Student in Vallur: హోం వర్క్ చేయలేదని.. విద్యార్థిని చితకబాదిన ప్రధానోపాధ్యాయుడు
🎬 Watch Now: Feature Video
Principal Beat Third class Student in Vallur: విద్యార్థిని హోం వర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులో జరిగింది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడోవ తరగతి చదువుతున్న బాలిక.. ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన హోం వర్క్ చేయలేదు. దీంతో బాలికపై ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు పాప శరీరం కమిలిపోయే విధంగా కర్రతో కొట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మరుసటి రోజు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించారు. మీ పాప అల్లరి చేయటం వల్లే కొట్టానని.. కావాలంటే టీసీ తీసుకుని వెళ్లండంటూ.. ప్రధానోపాధ్యాయుడు వారితో దురుసుగా ప్రవర్తించాడని పాప తల్లిదండ్రులు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకపోవడం వల్లే పాపను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని వారు వాపోయారు. పాపకు ఆరోగ్యం సరిగ్గా ఉండదని ఈ విషయం ప్రధానోపాధ్యాయునికి ముందుగానే తెలియజేశామని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ ప్రధానోపాధ్యాయుడుని వెంటనే విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.