HC Dismiss KR Suryanarayana Anticipatory Bail Petition: ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 8, 2023, 4:50 PM IST

HC on KR Suryanarayana Bail Petition: ఏపీ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్​ను ఇటీవల కింది కోర్టులో కొట్టేశారు. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం.. వ్యాజ్యాన్ని కొట్టేసింది. తనిఖీల పేరుతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం చేకూర్చారని విజయవాడ పటమట పోలీసులకు అందిన ఫిర్యాదుతో మే 30వ తేదీన నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఆ కేసులో సూర్యనారాయణను ఐదవ నిందితుడిగా చేర్చారు. పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సూర్యనారాయణ పిటిషన్​ దాఖలు చేయగా.. హైకోర్టు కొట్టివేసింది. కాగా ఉద్యోగుల సమస్యలపై గవర్నర్​కు ఫిర్యాదు చేసినప్పటి నుంచి సూర్యనారాయణకు చిక్కులు మొదలయ్యాయి. సూర్యనారాయణ వాణిజ్య పన్నుల శాఖలో సూపరింటెండెంట్‌ పదవిలో ఉన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.