హనుమాన్ జయంతి స్పెషల్​.. నైవేద్యంగా టన్ను బరువున్న లడ్డూ.. ఎక్కడంటే? - జబల్​పుర్​లో హనుమాన్​ జయంతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 3, 2023, 7:51 PM IST

మధ్యప్రదేశ్​లో హనుమంతుడికి భారీ లడ్డూను నైవేద్యంగా సమర్పించనున్నారు. హనుమాన్​ జయంతిని పురస్కరించుకుని ఈ భారీ లడ్డూను తయారుచేశారు. జబల్​పుర్​లో ఉన్న పురాతన పంచమాతా హనుమంతుని ఆలయంలో నైవేద్యం కోసం టన్ను బరువున్న లడ్డూను తయారుచేశారు. మహిళలే ప్రత్యేకంగా ఈ లడ్డూను తయారుచేయడం విశేషం. నిపుణులైన చెఫ్​ల సహాయంతో టన్ను బరువున్న భారీ లడ్డూను వారు తయారుచేశారు. ఆంజనేయుడికి నైవేద్యంగా లడ్డూను సమర్పించే సంప్రదాయాన్ని గతేడాది జబల్​పుర్​ వాసులు ప్రారంభించారు. గతసారి నగరంలోని యువకుల లడ్డూ ప్రసాదాన్ని తయారుచేశారు. ఈ ఏడాది మహిళలు చొరవ తీసుకుని కేవలం 7 రోజుల్లోనే.. 4 అడుగుల ఎత్తైన లడ్డూను సిద్ధం చేశారు. లడ్డూ బరువు అధికంగా ఉన్నందున దాని కింద మందపాటి ప్లాస్టిక్​ షీట్​ను ఏర్పాటు చేశారు. అర్చకులు వేద మంత్రాలతో లడ్డూకు పూజలు నిర్వహించారు. ఏప్రిల్​ 6న హనుమాన్​ జయంతి సందర్భంగా వేద మంత్రాలతో ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తారు ఆలయ అర్చకులు. అదే రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లుచేసి.. ప్రత్యేక లడ్డూలను భక్తులకు పంపిణీ చేస్తారు. అయితే, ఈ పంచమాతా దేవాలయాన్ని చాలా సంవత్సరాల క్రితం గోండు రాజులు నిర్మించినట్లు ఇక్కడి వారు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.