Gudivada Farmers Fire on Kodali Nani: సాయం చేయకున్నా పర్వాలేదు.. కానీ, అవమానించకండి: కొడాలిపై మండిపడ్డ రైతులు - కృష్ణాజిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-08-2023/640-480-19281068-thumbnail-16x9-gudivada-farmers-fire-on-kodali-nani.jpg)
Gudivada Farmers Fire on Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆ ప్రాంత రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కురిసిన వర్షాలతో నియోజకవర్గంలో నాట్లు మునగలేదు.. రైతులు నష్టపోలేదంటూ కొడాలి నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు ఎప్పుడైనా పర్యటించారా..? అని కొడాలి నానిని రైతులు ప్రశ్నించారు. ఈ విషయంలో రైతులకు సంఘీభావం తెలుపుతున్నట్లు టీడీపీ నేత వెనిగండ్ల రాము ప్రకటించారు. తమకు సహాయం చేయకున్నా పర్వాలేదు.. కానీ అవమాన పరిచే వ్యాఖ్యలు చేయొద్దని రైతుల విజ్ఞప్తి చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. డెబ్బై ఏళ్లలో ఇంత చిన్నపాటి వర్షానికి తాము ఎప్పుడు ఇంతలా నష్టపోలేదని నియోజకవర్గంలోని రైతులు తనకు తెలిపినట్లు రాము పేర్కొన్నారు. నాట్లు మునిగి రైతులు కష్టాలు పడుతుంటే.. ఎమ్మెల్యే కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని ఆయన అన్నారు.