Police Officers Association Responds To YS Jagan Comments: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అవమానకర, బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం, అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దానికి ఆయన బదులిచ్చారు.
బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని హితవు: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయాయని పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతానని జగన్ మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని వారు తెలిపారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత ఎనిమిది నెలల కిందట తమ ప్రభుత్వంలో పని చేసిన వారే అని ఆ విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.
రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారి పోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పోలీసులు ఎప్పుడూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన ఆ నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారని స్పష్టం చేసారు. చట్టాలను ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయరన్నారు. జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.
''మేం ఎప్పుడూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన ఆ నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తాం తప్ప చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయం. జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం''-జనకుల శ్రీనివాసరావు, ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు
అధికారంలోకి వచ్చాక వారందరి సంగతి తేలుస్తాం : వైఎస్ జగన్
వల్లభనేని వంశీ కేసులో ఆధారాలపై దృష్టి - కిడ్నాప్ సీసీ ఫుటేజ్ లభ్యం