Group 1 Ranker Sai Harshitha Interview: కోచింగ్ లేకుండా గ్రూప్-1లో సత్తా.. సాయి హర్షిత ఎలా ప్రిపేర్ అయ్యారంటే? - గ్రూప్ 1 ప్రిపరేషన్ ప్లాన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2023, 2:01 PM IST
Group 1 Ranker Sai Harshitha Interview: పేదింటి బిడ్డ గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికైంది. అది కూడా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా. తన బీటెక్ పూర్తయిన మరుసటి ఏడాదే వెలువడిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను చక్కగా సద్వినియోగం చేసుకుని సత్తా చాటింది. ఫలితంగా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి.. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికైంది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సాయి హర్షిత. తండ్రి వెంకటసుబ్బయ్య ఫ్రిజ్ మెకానిక్‌గా పని చేస్తుండగా.. తల్లి శారద ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. పేదలైన తల్లిదండ్రులు.. సాయి హర్షితను కష్టపడి చదివించారు. కొవిడ్ సమయంలోనే గ్రూప్స్‌పై దృష్టి సారించినట్లు సాయి హర్షిత చెబుతోంది. రోజుకు ఆరు గంటలు మాత్రమే పట్టుదలగా చదివేదాన్నని చెబుతోంది హర్షిత. మరి, తన ఈ ఉద్యోగం సాధించటానికి ప్రభావితం చేసిన అంశం ఏంటి..? ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. ఇంటివద్దనే పుస్తకాలను తిరగేసి.. గ్రూప్-1 పరీక్షలకు ఎలా సన్నద్ధమయ్యింది..? తనకు వచ్చిన అవకాశంతో పేదలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటుంది. లాంటి అంశాలను సాయి హర్షిత మాటల్లోనే విందాం.