AP High Court Chief Justice: విజయవాడ చేరుకున్న హైకోర్టు నూతన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ - chief justice dhiraj singh thakur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 27, 2023, 7:09 PM IST

Grand Welcome for AP High Court New Chief Justice: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్​ విజయవాడ చేరుకున్నారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్​కు.. గన్నవరం విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్​ చేరుకున్నారు. విమానాశ్రమయంలో సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్​కు.. జస్టిస్ శేషసాయి, దుర్గాప్రసాద్ సహా పలువురు న్యాయమూర్తులు, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, విజయవాడ సీపీ కాంతిరాణా ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయ ఆవరణలో పోలీసు శాఖ నుంచి గౌరవ వందనాన్ని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్వీకరించారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.