Government Vehicles and Machinery are Rusted: తుప్పు పట్టి చెత్తకుప్పల్లో దర్శనమిస్తున్న ప్రభుత్వ వాహనాలు.. పట్టించుకోని అధికారులు - government vehicles Condition in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 11:36 AM IST
Government Vehicles and Machinery are Rusted: ప్రభుత్వ వాహనాలు, యంత్రాలు తుప్పు పట్టి పిచ్చి మొక్కలు నడుమ చెత్తకుప్పల్లో దర్శనమిస్తున్న వైనం ప్రకాశం జిల్లా కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో నెలకొంది. ప్రభుత్వ అధికారులు ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తీర్చేందుకుగాను అప్పట్లో ప్రభుత్వాలు ఆయా శాఖల అధికారులకు వాహనాలను, యంత్రాలను పలు పనులకు సంబంధించిన పనిముట్లను సమకూర్చింది. అప్పట్లో అధికారులు వాటిని ఉపయోగించినప్పటికీ.. ఆ యంత్రాలకు, వాహనాలకు చిన్నచిన్న మరమ్మతులు రావడంతో వాటిని అధికారులు మూలన పడేశారు. ఫలితంగా ఆయా వాహనాలపై, యంత్రాలపై పిచ్చి మొక్కలు అల్లుకొని తుప్పు పట్టి నిరుపయోగంగా ఆయా కార్యాలయాల ఆవరణలో దర్శనమిస్తున్నాయి. మరికొన్ని కార్యాలయాలలో ఈ వాహనాలను చెత్త కుప్పలలో పడవేయడంతో ఆకతాయిలు వాటికి నిప్పు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ వాహనాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోనిక తీసుకవచ్చి ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.