Gold Shop Robbery Viral Video : నగల దుకాణంలో చోరీ.. అడ్డొచ్చిన పోలీసులపై కాల్పులు.. ఆఖరికి.. - నగల దుకాణంలో దొంగతనం
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 2:53 PM IST
|Updated : Aug 30, 2023, 3:23 PM IST
Gold Shop Robbery Viral Video : బంగాల్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. మారణాయుధాలతో నగల షాప్‌లోకి చొరబడి దొంగతనం చేశారు. పారిపోతున్న దొంగలను అడ్డుకున్న పోలీసులపై కాల్పులు జరిపారు. రాణాఘాట్లోని సెన్కో నగల దుకాణంలో ఎనిమిది మంది దొంగలు దోపిడీ చేసి పారిపోయే ప్రయత్నం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాణాఘాట్లోని ఓ నగల దుకాణంలోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. అనంతరం మరో ఆరుగురు దొంగలు షాప్‌లోకి చొరబడ్డారు. దోపిడీ అనంతరం ముగ్గురు దొంగలు బైక్‌పై పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులపై దొంగలు కాల్పులు జరిపారు. పారిపోతున్న మిగతా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి దొంగిలించిన నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది దొంగలు షాప్‌లో దోపిడీ చేశారని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. దొంగలు బిహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సుమారు రూ. కోటి విలువైన బంగారు, వెండి, వజ్రాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.