ప్రభుత్వాలు ఉచితాలు ఆపి ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందిస్తే చాలు : వెంకయ్యనాయుడు - Venkaiah Naidu comments on Telugu language
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 12:19 PM IST
Former Vice President Venkaiah Naidu Comments on Free Schemes: ఉచిత పథకాలు అనేవి ప్రభుత్వాలు మానుకొని వైద్యం, విద్యను ఉచితంగా ఇస్తే బాగుంటుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విశాఖ గాజువాక శ్రీనగర్ దగ్గర ఆపిల్ ఐ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువుకోవాలే కానీ చదువు కొనకూడదని పేర్కొన్నారు. మాతృభాష గురించి పిల్లలను ఆకట్టుకునేలా వినూత్నంగా వివరించారు. మాతృ భాషలో విద్య ఎంత అవసరమో సంస్కృతి సంప్రదాయం అంతే అవసరం చదువుకోవాలే కాని చదువు కొనకూడదని అన్నారు.
ప్రకృతి పరిరక్షణ, ధర్మ పరిరక్షణలో అంతా ముందుండాలని సూచించారు. ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మాతృ భాషలో చదువుకునే ఆ స్థాయికి ఎదిగారని అన్నారు. విలువలతో కూడిన విద్య పిల్లలకు తల్లిదండ్రులు అందించాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, టీడీపీ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, రెయిన్ బో హాస్పిటల్ చైర్మన్ రమేష్ కంచర్ల, ఆపిల్ ఐ స్కూల్ చైర్మన్ బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.