TIGER FOOTPRINT: పాదముద్రలు పులివేనా..! జాడ దొరికినట్లేనా.. - కాకినాడ జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
TIGER FOOTPRINT: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని పోతులూరు-ఒమ్మంగి పరిసరాల్లో పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పోతులూరు నుంచి 9 కిలోమీటర్ల దూరంలో పులి పాదముద్రల్ని గమనించిన సిబ్బంది.. పోతులూరు మెట్ట నుంచి వెళ్లి పాండవులపాలెం చెరువు ఒడ్డున నీళ్లు తాగిన ఆనవాళ్లను గుర్తించారు. పాండవులపాలెం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు.. పరిసర ప్రాంతాల్లో పశువుల్ని బయటకు వదలవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆహారం లభిస్తే ఇక్కడే మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆహారం దొరక్కపోతే మన్యంలోని రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం మీదుగా చింతూరు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST