తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'మెగా మేనల్లుడు' - sai dharam tej in ttd
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 4:59 PM IST
Film actor Sai dharam Tej visited Tirupathi: సినీ నటుడు, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్(sai dharam tej) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ(VIP) ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Tirumala Tirupati Devasthanam (TTD) Temple Authorities made Darshan Arrangements: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆలయ అధికారులు సాయిధరమ్ తేజ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేశారు. గర్భ గుడిలో స్వామివారిని దర్శనం అనంతరం సాయిధరమ్ తేజ్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సంపత్ నంది డైరెక్షన్లో సంక్రాంతి తరువాత కొత్త సినిమా షూటింగ్ (new movie shooting) ప్రారంభమవుతుందని సాయిధరమ్ తేజ్ తెలిపారు. ఇక.. గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి.
TAGGED:
HERO TEJ AVB APTPT0228