ఉరవకొండలో పురుగు మందుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత దాడులు - Agriculture Department Officer uma maheshwari raid

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 9:12 PM IST

Fertilizers Seize During Vigilance Raids in Ananthapur: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేని వివిధ రకాల కంపెనీల పేరుతో నాసిరకం మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. రూ.17లక్షల 90వేల విలువ చేసే నకిలీ మందులను  సీజ్‌ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఉమామహేశ్వరమ్మ తెలిపారు.

Vigilance Officers Raids on Fertilizer shop: ప్రముఖ కంపెనీల పేరుతో నాసిరకం మందుల విక్రయిస్తున్నారని ఈనాడులో ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ ఉన్నాతాధికారులు స్పందించారు.  ఉరవకొండ పట్టణంలోని పలు పురుగు మందుల దుకాణాలపై జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం సాయంత్రం విస్తృతంగా దాడులు చేశారు. ఇందులో భాగంగా మంజునాథ, వెంకటేశ్వర, ఉమామహేశ్వర ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ విక్రయిస్తున్న పురుగు మందుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో వెంకటేశ్వర అనే మందుల దుకాణంలో రూ. 1.70 లక్షల విలువైన నాసిరకం పురుగు మందులను సీజ్ చేసినట్లు ఉమామహేశ్వరమ్మ చెప్పారు. 

సీజ్ చేసిన మందులను అనంతపురం కోర్టులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ దుకాణం నిర్వాహకులపై కేసు నమోదు దిశగా ముందుకు పోతామన్నారు. అలాగే మిగతా దుకాణాలలో రూ. 16.21 లక్షల విలువైన అనుమతి లేని బయోమందులను గుర్తించారు. వాటి అమ్మకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ అదేశించామన్నారు. బయో మందులను విక్రయించడానికి జీ2 ధృవపత్రం ఉండాలని, అయితే దాని అనుమతి వచ్చే ఏడాది ఫిబ్రవరికి ముగుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ మందులను సరఫరా చేసిన కంపెనీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ జీ3 ధృవపత్రం కోసం దరఖాస్తు చేసి ఉండాలన్నారు. అలా దరఖాస్తు చేసినట్లు ఆధారాలను చూపితే, నిలుపుదల చేసిన ఆ మందుల అమ్మకాలకు అనుమతిస్తామన్నారు. ఈ దాడుల్లో వ్యవసాయ ఏడీ పద్మజ, ఏవో శుభకర్, ఉద్యాన సహాయకుడు చిక్కన్న పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.