Ministser Nimmala Ramanaidu Review On Polavaram: పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులపై విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో స్పెషల్ ఛీప్ సెక్రటరీ సాయిప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఆర్అండ్ఆర్ కమిషనర్, అధికారులు, ప్రాజెక్ట్ సీఈ, ఎస్ఈలు, ఆయా ఎజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పోలవరం లెప్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ. 960 కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తైంది. ఈ ఏడాది జూలై నాటికి పోలవరం లెప్ట్ కెనాల్ ద్వారా, గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలనే చంద్రబాబు లక్ష్యంకు వీలుగా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పునరావాసం, నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారంపై సమగ్రంగా చర్చించారు. రూట్ మ్యాప్ ప్రకారం పోలవరం పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. కేంద్రం అండదండలతో శరవేగంగా పోలవరం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేసి వారి రుణం తీర్చుకుంటామని అన్నారు.
గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఒక్క తట్ట మట్టి కూడా తవ్వలేదని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు ఒక్క రూపాయి నష్టపరిహారం కూడా అందించలేదని ఆక్షేపించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టకపోగా, నాటి జగన్ ప్రభుత్వం పనులను ప్రీ క్లోజర్ చేసిందని దుయ్యబట్టారు. ఆర్థిక సమస్యలున్నా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.1,600 కోట్లు కేటాయించారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టులో పురోగతి - నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు స్టార్ట్
2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల - సీఎం ఏమన్నారంటే!