Pet Dog Death: వారం క్రితం పెంపుడు కుక్క మృతి.. ఘనంగా సంతాప సభ - రోషన్ కుక్క మృతి
🎬 Watch Now: Feature Video
ఎంతో విశ్వాసంతో కుటుంబసభ్యులలో ఒకరిగా తమ మధ్య ఆరేళ్లుగా ఉన్న పెంపుడు కుక్క(రోషన్) వారం రోజుల క్రితం మృతి చెందింది. రోషన్ మృతికి.. ఆ కుటుంబం సంతాపం కార్యక్రమం ఏర్పాటు చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం వీవీ మెరకకు చెందిన రైతు చెంపాటి శివరామకృష్ణరాజు గత ఆరేళ్లుగా పెంచుకుంటున్న శునకం గత నెల 30 తేదీన అనారోగ్యంతో మరణించింది. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్న కుక్క (రోషన్) మృతి చెందడంతో ఏడు రోజుల తర్వాత శాస్త్రోక్తంగా సంతాప సభ ఏర్పాటు చేశారు. కుక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీనికోసం శ్రద్దాంజలి ఘటిస్తూ పత్రికలో యాడ్ కూడా వేయించారు. మనిషిలా మాట ఒక్కటే మాట్లాడలేదని భావోద్వేగాలు సైతం చూపేదని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పశువైద్యులు సరిగా అందుబాటులో లేకపోవడం సైతం తమ కుక్క మృతికి కారణమని రైతు శివరామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు.