'నకిలీ సర్టిఫికెట్లకు అడ్డాగా నర్సరావుపేట' వీసా ప్రయత్నంలో దొరికిన యువకుడు - రంగంలోకి చెన్నై పోలీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 3:52 PM IST

Fake Certificate Seller Arrested for Using Fake Documents for US Visa: అమెరిగా వెళ్లేందుకు వీసా కోసం నకిలీ పత్రాలతో దరఖాస్తు చేసిన వ్యక్తిని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నరసరావుపేటలో ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు వద్ద ఇటీవల అమెరికా వెళ్లేందుకు పల్నాడు జిల్లాకు చెందిన హేమంత్ అనే విద్యార్థి వీసా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 16న చెన్నై యూఎస్ కాన్సులేట్​లో హేమంత్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈక్రమంలో యూఎస్ కాన్సులేట్ అధికారులు హేమంత్ ధ్రువ పత్రాలను పరిశీలించగా అవి నకిలీవిగా అధికారులు గుర్తించారు. వెంటనే హేమంత్​పై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు యూఎస్ కాన్సులేట్ అధికారులు ఫిర్యాదు చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హేమంత్​ను విచారించగా నకిలీ ధ్రువ పత్రాలు నరసరావుపేటకు చెందిన ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు వద్ద కొనుగోలు చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు.  

ఈ నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత సోమవారం నరసరావుపేట చేరుకుని హరిబాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో తనిఖీ చేపట్టిన పోలీసులు కంప్యూటర్, సెల్ ఫోన్, 2 లక్షల నగదు, కొన్ని నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని వెళ్లారు. అయితే నకిలీ ధృవపత్రాలను విక్రయిస్తున్న హరిబాబు నరసరావుపేట మండలం గురవాయిపాలెంకు చెందిన వ్యక్తి కాగా గత కొంతకాలంగా పట్టణంలోని శ్రీనివాసనగర్​లో నివాసం ఉంటూ ప్రకాష్ నగర్​లో కార్యాలయం నడుపుతున్నాడు. హరిబాబు మరికొందరు విద్యార్థులకు నకిలీ ధ్రువ పత్రాలు ఇచ్చినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. గతంలో ఇదే తరహాలో కొందరు విద్యార్థులకు నరసరావుపేటకు చెందిన సన్నీ సైబర్ వేవ్, వంశీ సైబర్ నెట్ లకు చెందిన ఇద్దరు నిర్వాహకులు నకిలీ ధ్రువపత్రాలు విక్రయించి అరెస్టైన ఘటన మరచిపోక ముందే మరో ఘటన జరగడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.