బకాయిలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులను రెచ్చగొడుతోంది: బొప్పరాజు - AP JAC AMARAVATI LEADER BOPPARAJU
🎬 Watch Now: Feature Video
AP JAC AMARAVATI LEADER BOPPARAJU INTERVIEW : బకాయిలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులను రెచ్చగొడుతోందని ఏపీ ఐక్య కార్యాచరణ సమితి(JAC) అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. నెల నెలా వేతనాలే చెల్లించలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల పాత బకాయిలు వేల కోట్ల రూపాయలను ఎలా ఇస్తుందనే అపనమ్మకంతో ప్రతి ఉద్యోగి ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితులు రావడానికి ప్రభుత్వమే కారణమని బొప్పరాజు ఆరోపించారు. ఈ మార్చి లోపు పీఆర్‌సీ బకాయిలు, డీఏ, భత్యాలకు సంబంధించి వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలని కోరారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులే ఇస్తూ.. దానం చేసినట్టుగా మంత్రుల కమిటీ మాట్లాడటం సరికాదన్నారు. బకాయిలతో పాటు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందంటున్న ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.