రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో పురోగతి ఎలా ఉంది ? - జగన్ పారిశ్రామిక విధానాలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 9:25 PM IST
|Updated : Dec 30, 2023, 6:31 AM IST
Prathidwani: రాష్ట్రంలో పరిశ్రమల శాఖమంత్రి పనితీరెలా ఉంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన స్థితిగతులు మార్చడంలో ఇరుసులాంటి పారిశ్రామిక ప్రగతి విషయంలో పురోగతి ఎలా ఉంది. ఇందుకు సంబంధించిన అంశాలన్నీ చూసే పరిశ్రమల శాఖమంత్రి ఇంతకాలంగా ఏం సాధించారు. అంతర్జాతీయ కంపెనీలతో మాట్లాడే విషయంలో, వారిని కన్విన్స్ చేసి పెట్టుబడులను రప్పించే విషయంలో మంత్రి అమర్నాథ్ ఏ మేరకు సక్సెస్ అయ్యారు. ఐటీ శాఖ మంత్రిగా కూడా అమర్నాథ్ ఉన్నారు కదా. ఐటీ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ తెలంగాణకు ఎందుకు వెళ్లిపోయాయి. తెలంగాణలో ఐటీ అంత పురోగమిస్తే ఏపీలో ఎందుకు చతికిలపడింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం 5ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా మెదులుతున్న ప్రశ్నలివి. నేటి ప్రతిధ్వనిలో ఇదే విషయంపై ఆ రంగానికే చెందిన ఇద్దరు నిపుణులు చర్చించారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి విషయంలో వైఎస్సార్సీపీ హయాంలో ఏం జరిగింది. జగన్ సర్కారు పారిశ్రామిక విధానాలు, పరిశ్రమల శాఖ నిర్వహణకు ఎన్ని మార్కులు వేయొచ్చు. తదితర వివరాలన్నీ వారితో మాటల్లోనే తెలుసుకుందాం.