ETV Bharat / politics

దేశంలో ఎక్కడా లేని పథకం ఇది - కోటిన్నర మందికి లబ్ధి : మంత్రి నాదెండ్ల - MINISTER NADENDLA ON DEEPAM SCHEME

దీపం-2 పథకంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు - ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్

minister_nadendla_on_deepam_scheme
minister_nadendla_on_deepam_scheme (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 5:16 PM IST

Updated : Nov 15, 2024, 6:58 PM IST

Minister Nadendla Manohar on free Gas Cylinder Scheme: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రూ.141 కోట్ల 15 లక్షల 81 వేల నగదును లబ్దీదారుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలపారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ,రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు.

దీపం-2 పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా సమర్థంగా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సిలిండర్ డెలివరీ అయ్యాకే సబ్సిడీ మొత్తం అందిస్తున్నట్లు తెలిపారు. 3 విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని స్పష్టం చేశారు. ఈ పథకంపై వైఎస్సార్​సీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు.

గ్యాస్ సిలిండర్ల పథకంపై వైఎస్సార్​సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కోటి 55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నాం. సిలిండర్ డెలివరీ అయ్యాకే సబ్సిడీ మొత్తం అందిస్తున్నాం. ఉచిత గ్యాస్ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 35 లక్షల 77 వేల 566 గ్యాస్ సిలిండర్లు బుకింగ్ అయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి 2700 కోట్లు ఏడాదికి ఖర్చవుతుందని అంచనా వేశాం. అందరికీ ఒకేసారి కోట్లలో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయలేమని గ్యాస్ కంపెనీలు చెప్పాయి. మూడు విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించాం.- నాదెండ్ల మనోహర్, మంత్రి

రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు - ఎవరైనా కాదంటే రండి తేల్చుతా : సీఎం చంద్రబాబు

'రాష్ట్రం వెంటిలేటర్​పై ఉంది - ఐదేళ్లూ అడవి పందుల తరహాలో మేశారు'

Last Updated : Nov 15, 2024, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.