"ఎర్రచందనంను రైతులు సొంత ప్రదేశాల్లో సాగు చేయవచ్చు - ఎగుమతికి ఎలాంటి నిబంధనలు ఉండవు" - Sandalwood Farmers to Benefit from CITES Decision
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 1:42 PM IST
Central Environment Minister Bhupender Yadav Comments on Red Sandalwood : ఎర్రచందనంను అంతరించిపోతున్న వృక్షజాలం జాబితా నుంచి వేరు చేయాలన్న భారత్ విజ్ఞాపన నెరవేరింది. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఈ నెల ఆరు నుంచి ఐదు రోజుల పాటు జరిగిన CITIES (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) 77వ స్థాయి సంఘం భేటీలో.. అంతర్జాతీయ వాణిజ్య సమీక్ష నుంచి ఎర్రచందనంను తొలగించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) ట్విట్టర్(x) ద్వారా వెల్లడించారు.
Red Sandalwood Farmers to Benefit from CITES Decision : ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం మొక్కలను రైతులు తమ సొంత ప్రదేశాల్లో కూడా పెంచి, ఎగుమతులు చేసుకునే వెసులబాటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకే పరిమితం అయిన ఎర్రచందనం అంతరించి పోకుండా కాపాడుకోవటంతో పాటు రైతులకు కూడా అధిక ఆదాయం సమకూర్చే వనరుగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఎర్రచందనం ఎగుమతికి ఇకపై ఎలాంటి నిబంధనలు ఉండబోవని భూపేంద్ర యాదవ్ తెలిపారు.