అర్హులకు అన్యాయం జరగకూడదు - ఎన్నికల సంఘం ఆదేశాలు - anakapalli election commission meeting

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 5:21 PM IST

Election Commission Issued Guidelines to Officers: ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెంది, సమాజం పురోగతి సాధించి, మన జీవితం బావుండాలి అంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇంతటి విలువున్న ఓటుకు ఓట్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయి. ఇటువంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి స్పష్టం చేశారు.

Anakapalli District Collector Ravi said EC Issued Instructions About Voter List: ఓటర్ల జాబితాను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ఎన్నికల జాబితా సవరణ లోపాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆనంద్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ లవకుశ యాదవ్‌ ఇతర అధికారులతో నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితాలో లోపాలను సవరించి అర్హులకు అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగానే అధికారులకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని రవి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.