Dwakra unions fire on resource person ఆర్పీల అక్రమాలపై గళమెత్తిన డ్వాక్రా సంఘాలు.. తమకు తెలియకుండా లక్షలు తీసుకున్నారని ఆరోపణ - irregularities in DWCRA groups in ap
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 9:09 PM IST
Dwakra unions fire on resource person విజయనగరం జిల్లా పొనుగుటివలస గ్రామంలో డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు గ్రామ సచివాలయం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నినాధాలు చేశారు. పొనుగుటివలసలో 85 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. డ్వాక్రా గ్రూప్ సభ్యులకు తెలియకుండా.. రిసోర్స్ పర్సన్ (Resource Persons ) వారి పేరు మీద రుణాలు తీసుకున్నారు. డ్వాక్రా గ్రూప్‌లో జరుగుతున్న అక్రమాల విషయం తెలుసుకున్న డ్వాక్రా సంఘాల మహిళలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆర్పీలు తమకు తెలియకుండా దొంగ సంతకాలు చేసి రూ. 80 లక్షల రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బులను మా సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఆర్పీలు(RP) పెద్ద ఎత్తున రుణాలు వాడుకున్నట్లు మహిళలు ఆరోపించారు. తమకు తెలియకుండా... తమ సంతకాలు తీసుకోకుండా బ్యాంక్ అధికారులు పెద్ద ఎత్తున రుణాలు ఎలా ఇస్తారని మహిళలు ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వాలన్నప్పుడు సభ్యులందరినీ పిలిపించి సంతకాలు తీసుకున్న తరువాతే రుణాలు ఇస్తారు. కానీ ఆర్పీలకు బ్యాంక్ అధికారులు ఎలా రుణాలు ఇచ్చారని మహిళలు మండిపడుతున్నారు. గ్రామంలో ఒక్కసారిగా విషయం బయట పడటంతో మహిళలు లబోదిబోమంటూ బ్యాంక్‌కు పరుగులు తీస్తున్నారు. నెలవారి నగదు బ్యాంకుల్లో జమ కాకపోవడం కంగు తిన్న మహిళలు... న్యాయం కోసం గ్రామ సచివాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టామని పేర్కొన్నారు. అక్రమాలపై విచారణ జరిపించి బ్యాంక్ అధికారులు తమకు న్యాయం చేయాలని డ్వాక్ర సంఘాలు కోరుతున్నాయి.