Ex Commissioner Vijay Kumar Reddy Filed Petition in High Court : సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. 'సాక్షి' మీడియాకు అనుచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపులో 'సాక్షి' పత్రిక, టీవీ ఛానల్‌కు కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా సమాచార, పౌరసంబంధాల శాఖ అప్పటి కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి వ్యవహరించారంటూ ఏపీ మీడియా ఫెడరేషన్(ఏపీఎంఎఫ్) ప్రధాన కార్యదర్శి ఆర్.దిల్లీబాబురెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
'సాక్షి' పత్రికకు ప్రకటనలు : ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్ ఆర్థిక నేరానికి పాల్పడ్డారన్నారు. ఆర్థిక నేర ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తోందని, ఇలాంటి కేసులలో నిందితులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్ రూ.వందల కోట్ల రూపాయలను 'సాక్షి' పత్రికకు ప్రకటనల రూపంలో దోచిపెట్టారన్నారు.
ఉద్యోగుల నియామకంలో కుంభకోణం : అనుచిత లబ్ధి చేకూర్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. ప్రకటన ప్రచురణ కోసం 'సాక్షి' యాజమాన్యం కోరిన సొమ్ముకంటే విజయ్‌కుమార్‌రెడ్డి ఎక్కువ చెల్లించినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందన్నారు. పొరుగుసేవల ఉద్యోగుల నియామకంలో కుంభకోణం జరిగిందని, అందుకు పిటిషనర్ కారణం అన్నారు. విజయ్‌కుమార్‌రెడ్డిని విచారించేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)ప్రకారం సంబంధిత అధికారి నుంచి అనుమతులు పొందామన్నారు. వాస్తవాలను రాబట్టేందుకు నిందితుడి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అన్నారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తే దర్యాప్తుపై అవరోధం కలుగుతుందన్నారు.
'సాక్షి' న్యూస్ సహా పలువురి సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు
"బ్లూ మీడియా"లో ఎలాంటి మార్పూ రాలేదు - పరువు నష్టం కేసు గెలుస్తాం: లోకేశ్