ప్రైమ్ 2.0 విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి - దస్తావేజు లేఖరులు ధర్నా - ఎన్టీఆర్ జిల్లా ఈరోజు వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 4:54 PM IST
Document writers protest against Govt G.O.: రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని (కార్డ్ ప్రైమ్ 2.0) తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు నిరసన చేపట్టారు. నూతన విధానం వల్ల దస్తావేజు లేఖరులు, ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ప్రైమ్ 2.0 విధానం వల్ల అనేక మంది దస్తావేజుల లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Document Writers Leaders Comments: ''వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవలే ప్రైమ్ 2.0 విధానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో ప్రజలు, దస్తావేజుల లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు నానా అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయలతో ఆస్తులు కొనుగోలు చేసి, లక్షల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఆస్తి తాలూకు పత్రాలు ఇవ్వకుండా, జిరాక్స్ కాపీలు ఇస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దస్తావేజు లేఖరుల లైసెన్సులు రెన్యువల్ చేయాలి. కొత్తవారికి పరీక్షలు నిర్వహించి, లైసెన్సులు మంజూరు చేయాలి. ప్రైమ్ 2.0లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేశాకే దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.'' అని దస్తావేజు లేఖరుల వృత్తి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుమ్మలపల్లి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గుంటి వేణుగోపాల్ హెచ్చరించారు.