Decreasing Water Level in PABR Reservoir : డెడ్‌స్టోరేజీకి చేరిన 'పీఏబీఆర్' నీటిమట్టం.. తాగునీటికీ కష్టమే అంటున్న ప్రాజెక్టు అధికారులు - PABR Reservoir
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 3:55 PM IST
Decreasing Water Level in PABR Reservoir: అనంతపురం జిల్లా కూడేరు పరిధిలో ఉన్న పీఏబీఆర్ జలాశయం నీటిమట్టం తగ్గుతున్న క్రమంలో.. గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పీఏబీఆర్ జలాశయం వాస్తవ నీటిమట్టం 11.1 టీఎంసీలు కాగా.. ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో.. ప్రస్తుతం 2.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని పీఏబీఆర్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలోని పలు గ్రామాలకు కూడేరు తాగునీటి పథకం ద్వారా నీరు సరఫరా అవుతుందని అన్నారు.
ఈ ఏడాది ప్రకృతి సహకరించకపోతే ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవని పీఏబీఆర్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా.. 49 చెరువులకు నీటిని సరఫరా చేయాల్సి ఉందన్నారు. అయితే ఈసారి పీఏబీఆర్‌కు చాలా తక్కువగా నీరు రావడంతో.. నీటి విడుదల కష్టంగా మారిందని వెల్లడించారు. జీడిపల్లి ద్వారా హంద్రీనీవా జలాలను తరలిస్తే తాగునీటి కష్టాలు తగ్గించవచ్చని తెలిపారు. పీఏబీఆర్ నీటిని సాగు కోసం వాడుకోకుండా ఉరవకొండ, కూడేరు తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని అన్నారు.