thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 5:03 PM IST

ETV Bharat / Videos

జగనన్నా ఏంటన్న 'వైఎస్​ఆర్ సంపూర్ణ పోషణలో కుళ్లిన కోడిగుడ్లు'

Damaged Eggs Distributed to Pregnent Women: గర్భణీలు,బాలింతలకు పౌష్ఠికాహారం అందించేందుకు అమలు చేస్తున్న పథకంలో కుల్లిపోయిన కోడిగుడ్లు ప్రత్యక్షమవుతున్నాయి.ఇదేంటని అంగన్వాడీ కార్యకర్తను ప్రశ్నించగా పొంతన లేని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

YSR Sampoorna Poshana Scheme: వైసీపీ ప్రభుత్వం ఐసీడీఎస్(ICDS) ఆధ్వర్యంలో వైఎస్​ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం అంగన్​వాడీ కేంద్రాల ద్వారా అర్హులకు చేరుతుంది. దీనిలో కోేడిగుడ్లు,వేరు శెనగ చిక్కి , జొన్న పిండి, బెల్లం సహా 11రకాల ఆహార పదార్థాలను అందిస్తారు. పౌష్టికాహారం అందించేందుకు అమలు చేసే ఈ పథకం పౌష్టికాహారం విషయం పక్కన పెడితే నాణ్యమైన ఆహారమే లభించడం లేదు. దీనికి నిదర్శనం ఓ అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన కుళ్లిపోయిన కోడిగుడ్లే..

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం కోడిగుడ్ల పంపిణీ జరిగింది. ఓ గర్భణీ ఉడకబెట్టి తినడానికి ప్రయత్నించగా దుర్వాసన వచ్చింది.ఈ విషయమై అంగన్​వాడీ కార్యకర్తను ప్రశ్నిస్తే సదరు గర్భిణీ ఊరికి వెళ్లడంతో, ఆమె ఇవ్వాల్సిన కోడిగుడ్లను తీసిపెట్టామని ఆమె వచ్చిన తర్వాత కోడిగుడ్లు ఇచ్చానని ఆమె చెప్పింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.