'రోడ్లపై గుంతలుకాదు, గుంతల్లోనే రోడ్లు' - రహదారుల దుస్థితిపై మండిపడుతున్న వాహనదారులు - ఆంధ్రప్రదేశ్ గుంతల రహదారులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 3:49 PM IST

Damage Roads In Andhra Pradesh: ఇటీవల సంభవించిన మిగ్‌జాం తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలో రహదారులు అధ్వానంగా మారాయి. కొన్ని రహదారుపై అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకుండా పోయింది. ముందే గుంతలమయమైన రోడ్లు తుపాను ప్రభావానికి ప్రమాదకరంగా మారాయి. తణుకు నియోజకవర్గ పరిధిలో మండపాక-గుమ్మంపాడు, రేలంగి-అత్తిలి వెళ్లే ప్రధాన రహదారులు సైతం గుంతలను తలపిస్తున్నాయి. గుంతల ఆంధ్రప్రదేశ్ అనే పేరుకు రహదారులు సార్థకతను చేకూరుస్తున్నాయి. రహదారుల పరిస్థితిపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతల రోడ్లకు సంవత్సరాల తరబడి మరమ్మతు చేయకపోవడంతో వాహనాలు పాడైపోవడమే కాకుండా ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.

రాష్ట్రంలో రహదారుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. గత రెండు సంవత్సరాల నుంచి గుంతల రోడ్లుగానే ఉన్నాయి. ఎక్కడైనా రోడ్లపై గుంతలు పడతాయి కానీ గుంతల్లో రోడ్డు ఎక్కడ ఉందో తెలియటం లేదు. కుటుంబాలతో ప్రయాణం చేయాలంటే వాహనదారులు హడలెత్తి పోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది రహదారులను చూస్తే తెలుస్తోంది. అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. - మారుతీరావు, స్థానికులు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.