CWC Comments on Polavaram Diaphragm Wall: వరద తగ్గాక.. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై నిర్ణయం: సీడబ్ల్యూసీ - పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-08-2023/640-480-19291928-thumbnail-16x9-cwc-comments-on-polavaram-diaphragm-wall.jpg)
CWC Comments on Polavaram Diaphragm Wall: పోలవరం వద్ద వరద తగ్గాక క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాకే.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఖుష్విందర్ వోరా తెలిపారు. అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలను పరిశీలించిన తర్వాత డిజైన్లపై నిర్ణయం ఉంటుందన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే ముందడుగు వేయడం జరుగుతుందని అన్నారు. ప్రత్యామ్నాయాలు అంటే డిజైన్లే ఉంటాయి.. మేము ఏపీ బృందంతో పని చేస్తున్నామని అన్నారు. తప్పనిసరైతే పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శిస్తామని చెప్పారు. పోలవరంపై నిపుణుల కమిటీ వివరాలతో ఏపీ ప్రభుత్వం నుంచి లేఖ అందినట్లు వివరించారు. ప్రస్తుతం పరిష్కారాలపై పోలవరంపై నిపుణుల కమిటీ పని చేస్తోంది. వారు నివేదిక పంపిన తర్వాత నిర్ణయం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా మాకు క్షేత్ర స్థాయిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉంది.. వారు అక్కడి పరిస్థితిని పరిశీలిస్తూ మాకు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతున్నారు.. అవసరమైనపప్పుడు మేము కూడా అక్కడకు వెళ్తామని అన్నారు.