Crops Drying up Due to Lack of Irrigation Water: సాగునీరు లేక అన్నదాత గగ్గోలు.. పంటను కాపాడుకోలేక రైతు కంట కన్నీరు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2023, 1:07 PM IST

Crops Drying up Due to Lack of Irrigation Water: తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. సాగునీరు అందక కృష్ణా జిల్లాలో పంట పొలాలు నెర్రలిస్తున్నాయి. మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, పామర్రు, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వరి పంట పొట్ట దశలో ఉండటంతో నీరు లేక దబ్బ కంకులు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

వడ్డీలకు అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి సాగు చేస్తున్నామని, ఇప్పుడు పంట చేతికి రాకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు వాపోతున్నారు. పంటలు పండించేందుకు ప్రభుత్వం కనీసం సాగునీరు ఇవ్వలేకపోతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు పంటకు చాలా ఖర్చు అయింది.. ఇప్పుడు నీరు అందకపోతే ఆ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందని రైతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.